కాంగ్రెస్ ప్రచారంలో కామ్రేడ్లు మన దేశానికి ప్రజల జీవన మనుగడకు అత్యంత ప్రమాదకరమైన మతోన్మాద బీజేపీని పార్లమెంటు ఎన్నికల్లో మట్టి కరిపించాలని సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు అంబాల మురళి అన్నారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో సుందరయ్య కాలనీవాసులు కాంగ్రెస్ గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ దేశ ఉనికికి బీజేపీతో ప్రమాదం ఉన్నందున కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్నామని కాంగ్రెస్ గెలుపు కోసం ప్రజలు సహకరించి దేశ సుస్థిరతను కాపాడాలని అన్నారు. గత పది సంవత్సరాలు బీజేపీ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రామాలయం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం తప్ప మరొకటి లేదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత్ నిలబడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. రోటి కపడా మఖాన్ నినాదం కాంగ్రెస్తోనే వచ్చిందని సామాన్య మానవుడికి ముందుగా ఈవీ అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మరో సీనియర్ నాయకుడు ఉపేంద్ర చారి తో పాటు సుందరయ్య కాలనీవాసులు ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రమాదకరమైన బీజేపీని మట్టి కరిపించాలి
నవతెలంగాణ-గోవిందరావుపేట