నవతెలంగాణ-హైదరాబాద్ : వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ గెలిస్తే తరువాత నియోజకవర్గంలో పెద్దగా కనిపించరని వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. తన కుమారుడు బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు అతణ్ని చూసేందుకు నిత్యం వెళ్లేదాన్నని, అయితే కొన్ని రోజులకు రావడం తగ్గించండని ప్రిన్సిపల్ కోరారని తెలిపారు. ఆ ప్రిన్సిపల్ మాదిరిగానే ఇక్కడికి రావడం తగ్గించి ఢిల్లీలో ఉండండని వయనాడ్ ప్రజలు చెప్పే రోజు వస్తుందన్నారు.