యువ నాయకుడి మృతి తీరని లోటు..

నవతెలంగాణ – బెజ్జంకి
బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర నిశాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బీజేపీ పార్టీకి తీరని లోటని బీజేపీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న అవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర నిశాంత్ ఇటీవల అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిచేర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బీజేపీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న మంగళవారం మృతుడు నిశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిశాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించే క్రమంలో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించడంతో ఎల్లన్న ఓదార్చి బీజేపీ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని హామీనిచ్చారు. మండల బీజేపీ నాయకులు అయన వేంట ఉన్నారు.

Spread the love