మోకన్ పల్లిలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

నవతెలంగాణ- నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని మోకన్ పల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు సోమవారం మృతి చెందాడు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోకన్ పల్లి గ్రామానికి చెందిన రొడ్డ అనిల్(27) ఇంట్లో నుండి రెండు రోజుల క్రితం వెళ్లిపోగా కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతకగా ఈ రోజు గ్రామ గొర్రెకుంట చెరువులో మృతదేహం కనిపించగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై యాదగిరి గౌడ్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా మృతుడి  కాళ్లు, చేతులు తాడుతో కట్టి ఉండడంతో నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్, సౌత్ రూరల్ సీఐ నరేష్ లు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడి తల్లి అబ్బవ్వ ఫిర్యాదు మేరకు అనుమానదాస్పద కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Spread the love