చికెన్ తిని యువతి మృతి..వెలుగులోకి కొత్త విషయం

నవతెలంగాణ-హైదరాబాద్ : నిర్మల్‌లోని గ్రిల్9 రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని యువతి మరణించిన ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ఐటమ్స్‌పై మయోనైజ్ వేసుకుని తినడం వల్లే యువతి మరణించిందని, పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలయ్యారని అధికారులు తెలిపారు. ఇవాళ ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. కాగా తెలంగాణలో మయోనైజ్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినా కొన్ని రెస్టారెంట్లలో దీన్ని వాడుతుండటం గమనార్హం.
Spread the love