– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి (72) శ్వాస కోశ వ్యాధితో న్యూడిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటు గురువారం మరణించడం బాధాకరం అని సీపీఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ అన్నారు. ఆయనకు సీపీఐ (ఎం) పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటనీ, పార్లమెంటు లో ప్రజాసమస్యలు ప్రస్తాయించటం, దేశంలోని ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు ప్రస్తావించటంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఆయన ఇచ్చే సూచనలు పాలక ప్రతిపక్షాలకు దిక్షూచిగా ఉండేవరాన్నారు. ఆయన మరణం దేశ ప్రజలకు తీరనిలోటనీ, ఆయన మృతి పట్ల కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతానం తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తోపాటు జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, అరుణ్, నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు. వారి బౌతిక కాయం 14 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రెండు గంటల వరకు ఢిల్లీ లోనీ పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ లో సందర్శనార్థం ఉంచబడుతుందన్నారు. అనంతరం ఆయన కోరిక మేరకు ఆయన భౌతిక దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి ఇవ్వడం జరుగుతుందన్నారు.