సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు తుమ్మల భిక్షం రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య
నవతెలంగాణ – గోవిందరావుపేట
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కామ్రేడ్ తుమ్మల భిక్షం రెడ్డి మృతి బాధాకరం అని పార్టీకి తీరని లోటు అని ఆశయాలు కొనసాగించాలి అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య అన్నారు. శుక్రవారం మండలం లోని కోటగడ్డ గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి అధ్యక్షతన మహా నాయకుడు బిక్షం రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య హాజరై మాట్లాడుతూ కమ్యూనిస్ట్ ప్రమాణలకు అనుగుణంగా సోషలిజం ఆశయ సాధనకు జీవితాంతం తన వంతు కృషి చేసిన నాయకుడు భిక్షం రెడ్డి  అని అన్నారు. పార్టీ లో అనేక మంది సభ్యులను, కార్యకర్తలని నాయకులు గా తీర్చి దిద్దాడని అన్నారు. ప్రజా ఉద్యమాలు నిర్మించే క్రమంలో అనేక నిర్భంధాలని ఎదుర్కొన్నాడని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోణీ దీక్ష తో పార్టీ లో పని చేశాడని అన్నారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్, హిందుత్వం మీలాఖత్ అయి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ భిక్షం రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ తొలి రోజుల్లో ములుగు తాలూకా సభ్యుడిగా పని చేశాడని తన లాంటి యువకులను వెన్ను తట్టి ఉద్యమం లో ప్రోత్సహించిన నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి కుమార్,జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట రెడ్డి, సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి చింతామళ్ళ రంగయ్య, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, గోవిందరావుపేట మండలం ఎం పి పి సూడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ, టీ డి పి రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి,కుటుంబం సభ్యులు తుమ్మల కృష్ణ రెడ్డి, అతని భార్య అనసూర్య, తుమ్మల సుధాకర్,జిల్లా కమిటీ సభ్యులు చిట్టీ బాబు, రఘు పతి, వాసు, గఫుర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 350 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love