కొల్లు మల్లారెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటు..

– సూడి కృష్ణారెడ్డి సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
సిపిఐ(ఎం) పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు కొల్లు మల్లారెడ్డి అకాల మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మల్లారెడ్డి స్వగృహంలో భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి అందరితో ఆప్యాయంగా ఉండేవాడని మృదుస్వభావి స్నేహశీలి అని అన్నారు. గత అనేక సంవత్సరాల నుండి సిపిఎం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతూ.. అహర్నిశలు పార్టీ ప్రజాసంఘాల కార్యక్రమాల్లో పాల్గొనే వాడని పార్టీ  అంటే అతనికి ఎనలేని అభిమానమని ఆయన అన్నారు. అనంతరం అతని భౌతిక కాయంపై ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని జోహార్లు అర్పించారు. ఈ అంతిమయాత్రలో సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, గొంది రాజేష్, అంబాల పోషాలు, సోమ మల్లారెడ్డి, గుండు రామస్వామి, గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు, పిఎసిఎస్ డైరెక్టర్ సప్పిడి ఆదిరెడ్డి, నాయకులు యానాల ధర్మారెడ్డి, క్యాతం సూర్యనారాయణ, రెడ్డి పురుషోత్తం రెడ్డి, ముమ్మడి ఉపేంద్ర చారి, గరుగు ఐలయ్య, సత్యనారాయణ, సీతారాముడు, కొండయ్య, మురళి, బుజ్జిబాబు, రామకృష్ణ, అశోక్ పిట్టల, అరుణ్ సిరిపెల్లి జీవన్, రాజేశ్వరి, కవిత, కళ్లెం నారాయణ, చెవ్వు లింగయ్య, పుప్పాల రాజన్న, డాక్టర్ ఐలయ్య, ఎర్ర లక్ష్మీనారాయణ, సామ చంద్రారెడ్డి, తీగల సమ్మిరెడ్డి, మడిపల్లి చంద్రమౌళి, బద్ధం మోహన్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, గౌడ్ పంజాల శ్రీనివాస్, గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love