లక్ష్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

 – పార్టీ కోసం పని చేసిన గొప్ప నాయకుడిని కోల్పోయాం
 – బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌
నవతెలంగాణ- మల్హర్ రావు: బీఆర్‌ఎస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రైతు బంధు సమితి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న బండం లక్ష్మారెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు. గురువారం రాత్రి లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోగా ప్రమాద సంఘటనా స్థలాన్ని శుక్రవారం పుట్ట  పరిశీలించారు. అలాగే భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోని లక్ష్మారెడ్డి పార్థివ దేహన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. లక్ష్మారెడ్డి లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాయకుడు లక్ష్మారెడ్డి అని, అలాంటి నాయకుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.
Spread the love