పాదూరు శ్రీనివాస్‌రెడ్డి మృతి జనవిజ్ఞానవేదికకు తీరనిలోటు

– సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే కంచర్ల, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి పాదూరు శ్రీనివాస్‌ రెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో సోమవారం మరణించారు వారి పార్థివ దేహంనీ స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి మంగళవారం సందర్శించి సంతాపం తెలియజేశారు . సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్‌ ఉద్యమంలో, చదువు వెలుగులో కీలకంగా పనిచేశారు. అనేక రాష్ట్రాలు తిరిగి ఆయా రాష్ట్రాలలో ప్రజలని పట్టిపీడిస్తున్న మూడ విశ్వాసాలు బాణామతి నరబలులు స్త్రీల పట్ల వివక్ష బాల్య వివాహాలు వీటిని వీడాలని ప్రజల్లో చైతన్యం నింపడం కోసం అనేక జాతాలు నిర్వహించారని సైన్స్‌ టెంపర్‌ డెవలప్మెంట్‌ చేయడం కోసం తను చేసినటువంటి కృషి ఎనలేనిదని వారన్నారు. సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కాంగ్రెస్‌ నల్గొండ మున్సిపల్‌ ఫోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి ,యుటిఎఫ్‌ నాయకులు రాజశేఖర్‌ రెడ్డి , ఎడ్ల సైదులు, వెంకటేశం, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం, కౌన్సిలర్‌ కయిం బేగ్‌, సిపిఎం నాయకులు నడపరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love