– జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షలు అభిలాష్..
నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ నిరసిస్తూ విడాలి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు బంద్ పిలుపుమేరకు భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల బంధు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ల, ఆత్మహత్యల కలకలాలు సంచలనం రేపుతున్న ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం , విద్యార్థుల హత్యలు కాదు ప్రభుత్వ హత్యలుగా ప్రత్యక్షంగా కనబడుతున్నాయన్నారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ మరణాలు సంచలనంగా కనబడుతున్న అధికారులు ప్రభుత్వ మంత్రులు ,ముఖ్యమంత్రి ఎవరికి కూడా సోయలేకుండా కేవలం వారి సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారే తప్ప విద్యార్థుల సమస్యలపై ఏమాత్రం ఎవరు స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన వారు మండి పడ్డారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా నిధులు ఇవ్వడం లేదని, దానిద్వారా కాంట్రాక్టర్లు నాసిరకమైన సరుకులను పాఠశాలలకు అందిస్తూ విద్యార్థుల మరణానికి ప్రత్యెక కారణంమవుతున్నారు .కేవలం కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి సంబంధించిన వారు కాంట్రాక్టర్లుగా ఉండడం ప్రభుత్వ అండదండలతో విద్యార్థులను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించడం సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించి, ప్రభుత్వ పాఠశాల భవనాలు పూర్తి స్థితుల వ్యవస్థ చేరే వాటికి నూతన భవనాలు ఏర్పాటు చేయాలని గురుకులాలకు,హాస్టల్ నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు…. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా సహాయ కార్యదర్శి ఈర్ల రాహుల్ ,జిల్లా కమిటీ సభ్యులు భవాని శంకర్,నాయకులు మహేష్ , చింటూ,సతీష్, భాను ప్రకాష్ చందు,లోకేష్ కార్తీక్ పాల్గొన్నారు.