విషాదం..ఇంకుడుగుంతలో పడి బాలుడి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సాజన్(3) మంగళవారం ఉదయం ఇంటిబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటికి ఎదురుగా గ్రామ పంచాయతీ వద్ద ఉన్న పబ్లిక్ వాటర్ ఇంకుడుగుంతలో పడ్డాడు. సాజన్ కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు స్థానికుల ఇండ్లల్లో వెతికారు. అనుమానం వచ్చి ఇంకుడుగుంతలో వెతకగా, ఆచూకీ లభించింది. వెంటనే పైకి తీసి గన్నేరువరం దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాజన్‌ మృతితో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Spread the love