సుప్రీంకోర్టు జ‌డ్జీల సంచ‌ల‌న నిర్ణ‌యం

SUPRNEన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ వ్య‌క్తిగ‌త ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు నిర్ణ‌యించారు. త‌మ ఆస్తుల వివ‌రాల‌ను న్యాయ‌మూర్తులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయ‌నున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ ఆస్తుల వివ‌రాల‌ను ప‌బ్లిక్‌గా వెల్ల‌డించేందుకు జ‌డ్జీలు ఏక‌గ్రీవంగా అంగీక‌రించారు. పార‌ద‌ర్శ‌క‌త‌తో పాటు ప్ర‌జ‌ల్లో న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల విశ్వాసాన్ని నింపేందుకు ఈ చ‌ర్య‌కు పూనుకున్నారు. డిక్ల‌రేష‌న్ ద్వారా ఆస్తులు వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు న్యాయ‌మూర్తులు ఏక‌గ్రీవంగా అంగీక‌రించారు. ఢిల్లీ హైకోర్టు జ‌డ్జీ జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అధికారిక నివాసంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో భారీగా కాలిన క‌రెన్సీ నోట్లు దొరికిన విష‌యం తెలిసిందే..దీంతో ఆ విష‌యంతో వివాద‌స్ప‌దం కావ‌డంతో సుప్రీం న్యాయ‌మూర్తులు తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Spread the love