డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచన మేరకే కాళేశ్వరంపై నిర్ణయం : మంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్‌: డ్యామ్ సేఫ్టీ అధికారులు, నిపుణుల సూచన మేరకే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల విషయంల నిర్ణయం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.  శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బిక్షేశ్వర స్వామి దేవాలయంలో ఆయన మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ సాగునీటికి ఇబ్బందులు లేకుండా.. తాగునీటికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Spread the love