ఢిల్లీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం

The Delhi Bill is unconstitutional– సుప్రీం తీర్పును అధిగమించి ఆర్డినెన్స్‌ తెచ్చారు
– ముఖ్యమంత్రి అధికారాలను ఎల్‌జీ అధిగమిస్తారు
– ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం
– ఈ బిల్లుకు మా పార్టీ వ్యతిరేకం : సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్‌
– ఎన్నికైన ప్రభుత్వంపై పెత్తనమా? : బీఆర్‌ఎస్‌ ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి
న్యూఢిల్లీ : ఢిల్లీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్‌ విమర్శించారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ఈ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. మే 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఏడు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొ చ్చిందనీ, సుప్రీంతీర్పును అధిగమించి ఆర్డి నెన్స్‌ తెచ్చారని విమర్శించారు. ఆఘ మేఘా ల మీద ఆర్డినెన్స్‌ తీసుకురావల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 123(1) ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్స్‌ తీసుకొస్తారని చెప్పారు. అధికారాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ తీసు కొచ్చేటప్పుడు ఆర్టికల్‌ 123(1)ని పరిశీలించా లని సుప్రీంకోర్టు చాలాసార్లు తెలిపింద న్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ చేయకుండా తొందరపడిందని విమర్శించా రు. ఆర్టికల్‌ 239 ఎఎ ప్రకారం సివిల్‌ సర్వీస్‌ లకు సంబంధించిన చట్టాలను చేసే అధికా రం ఢిల్లీ ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) పాత్రను పబ్లిక్‌ ఆర్డర్‌, పోలీస్‌, భూమి అంశాలకు మాత్రమే పరిమితం చేసిం దని తెలిపారు.
రాష్ట్ర మంత్రి వర్గం సలహా మేరకు నడుచుకోవాలని సూచించిందని స్పష్టం చేసిందన్నారు. సమాఖ్య వ్యవస్థ ఢిల్లీకి కూడా వర్తింప చేసిందని తెలిపారు. ముగ్గురు సభ్యులు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం ప్రిన్సిపల్‌ కార్యదర్శితో ఉన్న కమిటీ ప్రతిపాదిస్తుందని ఈ బిల్లులో పేర్కొన్నారనీ, అయితే అందులో ఇద్దరు (మెజార్టీ) అధికారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన వారేనని అన్నారు. అయితే ఈ కమిటీలో మెజార్టీ ప్రతిపాదన లపై ఎల్‌జీ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అలాగైతే ఎన్నికైన ముఖ్య మంత్రి అధికారాలను ఎంపికైన అధికారులు అధిగమిస్తారని తెలిపారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కింద ఎవరు పని చేస్తారని ప్రశ్నించారు. ఎల్‌జీ అంతిమ నిర్ణయం తీసు కోవడమనేది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేక మని అన్నారు. ఎన్నికైన ప్రభుత్వంపై ఎల్‌జీ ఆధిపత్యమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యంగా ఉందని విమర్శించారు. ఢిల్లీ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రజా తీర్పుకు భిన్నంగా వ్యవహరి స్తున్నదని ఆరోపించారు. బీజేపీ ఢిల్లీ మున్సి పాల్టీపై ఆధిపత్యం కొనసాగించడం కోసం నాలుగు మున్సిపాల్టీ కౌన్సిళ్లను ఒక కౌన్సిల్‌గా విలీనం చేస్తూ ఇక్కడే బిల్లు ఆమోదించారనీ, కానీ ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికల సమయంలో కూడా తమకు మెజార్టీ లేకపోయినా అడ్డదార్లో ఎల్‌జీని ఉపయోగించి మేయర్‌ పదవిని కాజేయాలని చూశారని విమర్శించారు. ప్రజల తీర్పు ఉన్నప్పటికీ కోర్టు తీర్పు తరువా తనే ఆప్‌ తరపున మేయర్‌ అయ్యారని అ న్నారు. బీజేపీయేతర రాష్ట్రాలపైన గవర్నర్ల ను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. లక్ష్య దీప్‌, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గవర్నర్లు ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారనీ, తమిళనాడులో ఏకంగా గవర్నర్‌ మంత్రిని తొలగించారని పేర్కొ న్నారు. అలాగే జమ్మూకాశ్మీర్‌ వలే ఎన్నికైన అసెంబ్లీలను కూలదోసి, ఎంపికైన అధికారు లతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శిం చారు. చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని బీజేపీ అధికారంలోకి వచ్చిందనీ, ఇలాంటి పరిస్థితుల కోసం బ్యూరోక్రసీ అధికారాలను ఉపయోగించే విధంగా ఈ బిల్లు ఉందని విమర్శించారు.
మణిపూర్‌లో పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, కానీ బీజేపీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు మార్చటం లేదని ప్రశ్నించారు. మణిపూర్‌ అంశంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు మౌనంగా ఉందనీ.. ఎందుకంటే, అక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ అజెండాతోనే అల్లర్లు జరుగుతున్నా యని తెలిపారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య, రాజ్యాంగ, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉందని అన్నారు.
అధికారాలను కేంద్రం నియంత్రిస్తుంది
ఎన్నికైన ప్రభుత్వంపై పెత్తనమా? అని బీఆర్‌ఎస్‌ ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను నియంత్రిస్తున్నదని విమర్శిం చారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో ఢిల్లీ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ తరపున జి. రంజిత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉద్దేశం ఏమిటో తెలియాలని ఆశిస్తు న్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని విలువలకు విరుద్ధంగా ఉండే ఈ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఢిల్లీ బ్యూరో క్రసీపై చాలా ఏళ్లగా చర్చ జరుగుతుందనీ, ఎవరు ఎవరికి రిపోర్టు చేయాలనీ, వారి బాధ్యతేమిటనీ, ఎవరికి జవాబుదారీతనంగా ఉండాలి అనే దానిపై చర్చ జరుగుతోందని అన్నారు. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రభుత్వం గురించి బీజేపీ తరపున చర్చలో పాల్గొనేవారు మాట్లాడటం లేదని అన్నారు.
బ్రూరోక్రసీ మంత్రులు, ముఖ్యమంత్రికి జవాబుదారీగా ఉండాలని, మంత్రులు, ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీకి జవాబుదారీతనంగా ఉండాలని, రాష్ట్ర అసెంబ్లీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉం డాలని అన్నారు. మొత్తం జాతీయ రాజధాని ప్రాంతంలో చట్టాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉందని తెలిపారు. ఈ బిల్లులో ముగ్గురు సభ్యుల కమిటీ గురించి పేర్కొన్నారనీ, అందులో ఇద్దరు సభ్యులు కేంద్ర ప్రభుత్వం నియమించి వారేనని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తాడని ప్రశ్నించారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నరే నిర్ణయిస్తే, ముఖ్యమంత్రి పాత్ర ఏంటని ప్రశ్నించారు. వాటర్‌ రెగ్యూ లేటరీ, ట్రాన్స్‌ పోర్టు, టూరిజం, జలబోర్డు వంటి 50 అధికా రాలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుందని, ఇక ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయ గలదని విమర్శించారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు ఎటువంటి స్వతంత్ర అధికారం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
బీఆర్‌ఎస్‌ ఎంపీ జి.రంజిత్‌ రెడ్డి

Spread the love