నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ఆరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఫపాద్యాయుల కొరతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలను మండల కేంద్రంలో ఎంఈవో రాములు నాయక్ లేనందున మంగళవారం కార్యాలయం సిబ్బంది ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ప్రకచనలో తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్ఎఫ్ఐ జుక్కల్ మండల అధ్యక్షులు షైక్ ఫిర్దోస్ మాట్లాడుతూ జుక్కల్ మండలం లోని అన్ని జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో ఉపాధ్యాయుల మార్పిడి లో భాగంగా జుక్కల్ మండలం లోని జుక్కల్,( ఇంగ్లీష్ -4, గణితం -1, భౌతిక శాస్త్రం -1, జీవశాస్త్రం -1, హింది -1, సాంఘిక శాస్త్రం -2 ) పెద్ద ఎడ్గి ( తెలుగు -1, ఇంగ్లీష్ -1, భౌతిక శాస్త్రం -1, సాంఘిక శాస్త్రం -1, PD-1 ) , హంగార్గ్ ( గణితం -1, ఇంగ్లీష్ -1, తెలుగు -1) కౌలాస్ ( ఇంగ్లీష్ -1 ) ఖండేబాల్లూర్ ( గణితం -1, భౌతిక శాస్త్రం -1 )గాల గ్రామం లో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల లో ఉపాధ్యాయలు లేక అనేక ఇబ్బందులపాలు పడుతున్నారు విద్యార్థులు ఈ వార్షికోత్సవ ప్రారంభం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఉపాధ్యాయ మార్పిడి అనే పేరుతో తరుగతులు జరుగలేదు మళ్ళీ తిరిగి రావాల్సిన ఉపాధ్యాయలు ఇప్పటి వరకు రాలేదు విద్యార్థుల జీవితలు నాశనం కావద్దు అంటే తక్షణమే తిరిగి రావాల్సిన ఉపాధ్యాయలను తక్షణమే కేటాయించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమం లో జుక్కల్ మండల నాయకులు సాగర్,జెమిల్, విలాస్ పాల్గొన్నారు.