ఉద్యోగ కార్మికుల డిమాండ్ లను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి

– కార్మికుల జిల్లా వర్క్ షాప్ లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్  డిమాండ్
నవతెలంగాణ- భువనగిరి:
తెలంగాణ రాష్ట్రంలో 2023 నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రంగాల్లోని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను, డిమాండ్లను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని CITU జిల్లా వర్క్ షాప్ లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ గారు  డిమాండ్ చేశారు. ఈ జిల్లా వర్క్ షాప్ కి సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఉద్యోగ, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వారి న్యాయమైన డిమాండ్లను చేర్చాలని, కార్మికుల కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు హామీ, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేని పేస్టో లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చట్టబద్ధ సౌకర్యాలు అన్నిటిని కల్పిస్తామని, ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో కోటి మందికి ప్రయోజనం కలిగే 73 షెడ్యూల్ పరిశ్రమల్లో వేతనాలను పెంచుతామని, బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేస్తామని, రాష్ట్రంలో స్కీం వర్కర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, పంచాయతీ ఉద్యోగ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించేలా మేనిఫెస్టోలో చేర్చాలనిడిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న సకల కార్మిక వర్గం సమస్యలను ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పరిష్కారం చూపి మేనిఫెస్టోలో  ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లా వర్క్ షాప్ లో  సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు  జిల్లా  సహాయ కార్యదర్శులు మాయ కృష్ణ, సిలివేరు రామకుమారి, బోడ భాగ్య, సుబ్బూరు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు పొట్ట యాదమ్మ, పోతరాజు జహంగీర్, గాడి శ్రీన, కొల్లూరు ఆంజనేయులు, గంధమల్ల మాతయ్య, పుప్పాల గణేష్ , గడ్డం వెంకటేష్, మొరిగాడి రమేష్, మంచాల మధు, మారయ్య, బందెల బిక్షం, జిల్లా నాయకులు  తూటి వెంకటేష్, సంగిరాజు, గ్యార సురేష్, శివ, రాము, సుజాత, వరలక్ష్మి శ్రీలత, యాదగిరి, మహేష్, నవీన్ పాల్గొన్నారు.
Spread the love