వీఓఏల డిమాండ్లను అమలు చేయాలి

సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య
నవతెలంగాణ-తలకొండపల్లి
వీఓఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. 39 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో మహిళల సాధికారిత అభ్యున్నతి కోసం వీఓఏలు ఎనలేని సేవ చేస్తున్నారని తెలిపారు. సెర్ప్‌ సంస్థ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమాకురుస్తున్న కనీసం వారిని సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించడం లేదని వాపోయారు. దాదాపుగా 18 ఏండ్లుగా పనిచేస్తునప్పటికి కనీస వేతనానికి కూడా నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారికి కనీస వేతనం రూ. 26 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీఓఏల మండలాధ్యక్షులు బాలకిష్టయ్య, కడ్తాల్‌ మండల అధ్యక్షులు బడక జానకి రాములు, తలకొండపల్లి వివోఏలు కృష్ణారెడ్డి, మీసాల నరసింహ, కల్పన యాదయ్య అరుణ, భాగ్యలక్ష్మి, వనజ, మంజుల, శ్రీలత ,యాదమ్మ, శశికళ, మానస, స్వప్న, మంగమ్మ, అనిత,నరసింహ, చారి, శ్రీవాణి ,వంకురి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Spread the love