వారాంతంలోగా వరద నష్టం వివరాలివ్వాలి: సీఎస్ అదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలన్నారు.

Spread the love