ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం: ప్రిన్సిపల్ గంగాధర

నవతెలంగాణ – నసురుల్లాబాద్

ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన వరంలాంటిదని,  ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని ఎస్అర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అన్నారు.  గురువారం బాన్సువాడలోని శ్రీ రామ్ నారాయణ్ కేడియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యోజన సంఘటన్, ఫ్రెండ్స్ యూత్ సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ….18 సంవత్సరాల నిండిన యువతి, యువకులకు ఓటు హక్కు దేశ సంక్షేమానికి అభివృద్ధికి పునాది లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రం, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలకు సుపరిపాలన అందించే ఒక మంచి లక్షణాలు కలిగిన అభ్యర్థిని ఎన్నికల సమయంలో ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు. డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ఓటు వజ్రాయుధం అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అవసరన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే ఆధారమన్నారు. ఈ కార్యక్రమంలో నాయక్ తాసిల్దార్ రచప్ప నేరు యువజన కోఆర్డినేటర్ సునీల్ రాథోడ్ , కోఆర్డినేటర్ కృష్ణ,శ్రీనివాస్, శ్రీదేవి,విఠల్ , రామకృష్ణ, కళాశాల లెక్చరర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love