జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ఇబ్బందులు తప్పాయి

– ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
ఆర్అండ బి ఎస్ ఈ కార్యాలయం ప్రారంభించడం సంతోషకరం మంత్రి
నవతెలంగాణ – సిద్దిపేట
జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో వివిధ పనులపై సంగారెడ్డికి వెళ్లే బాధలు తప్పాయని, నేడు ఆర్ అండ్ బి ఎస్ ఈ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆర్ అండ్ బి ఎస్ ఈ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో చిన్న , చిన్న పనుల కోసం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డికి పోయే వారమని, కానీ నేడు సిద్దిపేటలో పంచాయతీరాజ్ శాఖ , ఆర్ అండ్ బి , విద్యుత్, ఇరిగేషన్ శాఖల ఎస్ ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పయని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతోటి వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ ను ఏర్పాటు చేసుకున్నమని, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసుకున్నమని, అభివృద్ధికి పది అడుగుల ముందే ఉన్నామని, 50 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆలోచించి పనిచేస్తు అని అన్నారు. 500 ఎకరాలలో అర్బన్ పార్కును ఏర్పాటు చేసుకోబోతున్నామని, ఫారెస్ట్ వారి సహకారంతో ఆరు కోట్ల రూపాయలతో మెగా నర్సరీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, 440 కె.వి రెండు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నామని, సిద్దిపేటకు రెండవ రింగ్ రోడ్డును నిర్మాణం చేసుకుంటున్నామని అన్నారు. వసంత నాయక్ మొదటి ఆర్ అండ్ బి ఎస్ ఈ అధికారిగా రావడం సంతోషంగా ఉందని , ఈయన గతంలో యాదాద్రిలో పని చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు రాము, వెంకటేశం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love