రెడ్ క్రాస్ బృందాన్ని అభినందించిన జిల్లా పాలనాధికారి

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పొందిన ఐ.ఎస్.ఓ సరిఫికేట్ కి గాను జిల్లా పాలనాధికారి , రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ హన్మంతు ఐ.ఏ.ఎస్ బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇలానే నిజామాబాదు రెడ్ క్రాస్ సేవలు విస్తరించాలని రాష్ట్రంలోనే నిజామాబాదు కీర్తిని మరింత ప్రతిబింప చేయాలని కోరారు తదుపరి అదనపు పాలనాధికారి చిత్రా మిశ్ర ని కూడా రెడ్ క్రాస్ బృందం కలిసి వారి మన్నలను పొందారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు జిల్లా శాఖ రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ మరియు కోశాధికారి కరిపే రవీందర్, కార్యదర్శి అరుణ్ బాబు, నిజామాబాదు డివిజన్ చైర్మన్ డా. శ్రీశైలం, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ పాల్గొన్నారు.

Spread the love