విద్యార్థిని మృతికి కారణమైన డాక్టర్ ను సస్పెండ్ చేయాలి

– అనారోగ్య కారణాలతో నిన్న కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరిన బాలిక
– ఈ రోజు మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యులు, తాండా వాసులు
– ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన బాధితులు
– సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది
నవ తెలంగాణ-తాడ్వాయి
కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్యాసంపల్లి తండాకు చెందిన విద్యార్థిని ఇస్లావత్ లావణ్య (16) అనే బాలిక చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం మృతి చెందింది. లావణ్య ఆరోగ్యం సరిగా లేదని అనారోగ్య కారణాలతో నిన్న ఏరియా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు లావణ్య సాయంత్రం ఐదు గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందిందంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, తండావాసులు ధర్నాకు దిగారు. లావణ్య తండ్రి నాజు గల్ఫ్ కు వెళ్ళగా, తల్లి నీల నలుగురు పిల్లలతో క్యాసంపల్లి తాండలో నివసిస్తుంది. లావణ్య పెద్ద అమ్మాయి నీహారిక, లహరిక, జగదీష్ లు ఉన్నారు. లావణ్య సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే పదవ తరగతిలో పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది. వడ దెబ్బతోనే లావణ్య మృతి చెందిడతున్న డాక్టర్లు తెలిపినట్టు సమాచారం. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు చేస్తున్న ధర్నా కారణంగా రోడ్డు కిరువైపులా భారీగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యులను సముదాయిస్తున్నారు.

Spread the love