లక్నవరం చెరువు ప్రధాన కాలువల గండ్లను వెంటనే పూడ్చాలి..

– తుమ్మల వెంకటరెడ్డి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు
నవతెలంగాణ- గోవిందరావుపేట
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్నవరం చెరువు ప్రధాన కాలువలకు అనేక గండ్లు పడ్డాయని ఈగండ్లను వెంటనే ప్రభుత్వం పూడ్చి సాగునీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని శ్రీరాం పతి కోట కాలువ రంగాపూర్ కవిట్ల కాలువల గండ్లను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలువలకు శ్రీ రామ్ పతి కాలువ చెప్పుల ఓర్రె దగ్గర పెద్ద ఎత్తున గండి పడిందని, నరసింహుల కాలువ బల్సుమాటు దగ్గర, గోపయ్య మత్తడి ,దగ్గర పెద్ద ఎత్తున గళ్ళు పడ్డాయని మొత్తం మూడు కాలువలకు 30 గండ్లు దాకా పడ్డాయని పేర్కొన్నారు లక్నవరం చెరువు కాకతీయులు నిర్మాణం చేస్తే ఈ పాలకులు రైతులకు కనీసం సాగునీరు అందించడం లేదని మండిపడ్డారు. రైతాంగం నార్లు పోసుకొని నెల రోజులు పూర్తయిన ఇప్పటికే మండలంలో కొన్ని నాట్లు పూర్తయ్యాయని వర్షాలు పోవడంతో మిగిలినట్లు ఆగిపోయినాయి అని అసలే సీజన్లో నార్లు లేటుగా పోసుకొని రైతులకు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు భారీ వర్షాలతో కాల్వ గండ్లు బడి నీళ్లు రాక లక్నవరం చెరువు నిండా నీళ్లు ఉండి నాటు వేయలేని దుస్థితి రైతులకు ఏర్పడిందని పేర్కొన్నారు ఇట్టి విషయాన్ని ఐబీ అధికారులు మాట్లాడిన స్పష్టత ఇవ్వలేదని ఎప్పుడు గండ్లు పూడుస్తారు ఎప్పుడు నీళ్లు వదులుతారు అని అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా నీటిపారుదల శాఖ డి ఈ శ్రీనివాస్ దాటవేస్తున్నారని వెంటనే కాలువ పడిన గండ్లను పూర్తి చేసి రైతులకు నాటు వేసుకోవడానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంకా ఆలస్యమైతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు రైతు సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గుండు రామస్వామి రామచంద్రారెడ్డి తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు పొదిలి చిట్టిబాబు అంబాల పోషలు రైతులు బొబ్బ సత్తిరెడ్డి ఏనుగ శేఖర్ రెడ్డి పోతరాజు కృష్ణ నిడుమోలు పాండు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love