ఆటోను ఢీకొట్టిన కారు.. డ్రైవర్ మృతి

– నెల్లికుదురు ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ 
నవతెలంగాణ-నెల్లికుదురు : వెనుక నుంచి ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ కం ఓనర్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాన్ల సుధాకర్ రెడ్డి యధావిధిగా తొర్రూరు బ్రెడ్ కంపెనీ నుంచి తన సొంత హ్యాపీ ఆటోలో పరిసర మండలాల లోని షాపుల కు సరఫరా చేస్తాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తొర్రూరు నుంచి నెల్లికుదురుకు వస్తున్న క్రమంలో కాచికల్ ఇటిక బట్టీల సమీపంలో కారు వెనుక నుంచి వేగంగా వస్తూ ఢీ కొట్టింది. దీంతో ఆటో కు చెందిన సుధాకర్ రెడ్డి తీవ్రగాల గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ పరారైనట్లు చెప్పారు.మృతుని భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.
Spread the love