నవతెలంగాణ – తాడ్వాయి
గుర్తుతెలియని లారీ ఆటోను ఢీకొని డ్రైవర్ తీవ్ర గాయాల పాలైన సంఘటన ఒడ్డుగూడెం- బంధాల పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని బంధాల గ్రామానికి చెందిన కురుసం తిరుపతి అనే ఆదివాసీ యువకుడు ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్నాడు. అందులో భాగంగా గురువారం బంధాల గ్రామం నుండి పస్రా కు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని లారీ అతివేగంగా ఆటోను ఢీకొని తప్పకుండా వెళ్లిపోయాడు. ఆటో ఓనర్ కం డ్రైవర్ కుర్సం తిరుపతి తలకు తీవ్ర గాయం కావడంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించి వైద్యం పొందుతున్నాడు. తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా లారీ తప్పించుకున్నాడు. అక్కడి నుండి కాచినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లారీని పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం.