డ్వాక్రా గ్రూప్ మహిళ సంఘంలో జరిగిన అవకతవకలపై నిలదీసిన మహిళలు

నవతెలంగాణ – రెంజల్
గత ఆరు నెలలుగా డ్వాక్రా గ్రూప్ మహిళ గ్రూపులో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేసిన ఐకెపి సిబ్బంది ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శుక్రవారం నాడు వరలక్ష్మి మహిళా గ్రూపు సభ్యులు సిబ్బందిని నిలదీశారు. వరలక్ష్మి గ్రూప్ బ్యాంకుకు క్రమం తప్పకుండా రుణాలను చెల్లిస్తూ ఉండగా, స్థానిక వివో ప్రతినిధులను శ్రీనిధికి బదిలీ చేశారని, తమ గ్రూపులో శ్రీనిధికి ఎలాంటి రుణాలు చెల్లించవలసిన అవసరం లేకపోయినా , ఆమె ఇట్టి నిధులను బదిలీ చేయడం పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 6 తేదీలోపు అట్టి నిధులను వరలక్ష్మి గ్రూపులో జమ చేస్తామని లిఖిత పూర్వకముగా  హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

Spread the love