గాడి తప్పిన విద్యాశాఖ

– జిల్లా అంతటా ఇంచార్జీ ఎంఈఓలే
– జీహెచ్‌ఎంలు కూడా సగం ఇంచార్జీలే
– సమీపిస్తున్న వార్షిక పరీక్షలు
– వంద శాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యం
– నిలిచిన పదోన్నతులు
పర్యవేక్షణ లోపంతో విద్యా శాఖ గాడి తప్పుతోంది. జిల్లాలో ఇంచార్జీ ఎంఈఓలు తప్ప రెగ్యులర్‌ బాధ్యులే లేరు. పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడంతో సబ్జెక్ట్‌ టీచర్లకే జీహెచ్‌ఎంలుగా నియమించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తు న్నాయి. పాఠ్యాంశాల బోధన, పరీక్షలకు ప్రిపరేషన్‌ చేయడ ంలో అశ్రద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి. అందు కోసం తగిన రీతిలో విద్యా బోధన కొనసాగాలి. పరీక్షలకు ప్రిపరే షన్‌ చేయడం, విద్యార్థులకు అదనపు క్లాసులు తీసుకోవడం, స్టడీ అవర్స్‌ పెంచడం వంటివి జరగాలి. విద్యా సంవత్సరం క్యాలెండర్‌ ఉన్నప్పటికీ ఆచరణలో అది అమలు కాని పరిస్థి తులున్నాయి. విద్యతో పాటు పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం పథకం, అల్పాహారం అందించే పనుల్ని కూడా చక్కబెట్టాలి. కానీ..! ఒక మండలానికి ఇంచార్జీ ఉన్న ఎంఈఓలకు అదనంగా రెండు మూడు మండలాల బాధ్యతలు కూడా ఇవ్వడంతో వారంతా ఏ పనినీ సరిగ్గా చేయలేని పరిస్థితులున్నాయనే అభిప్రాయముంది.

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లాలో 28 మండలాలు న్నాయి. వీటిల్లో 846 ప్రాథమిక పాఠశాల లు, 199 ప్రాథమికోన్నత పాఠశా లలు, 203 ఉన్నత పాఠశాలలు కలిపి 1262 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిల్లో లక్షా 20 వేల మంది వరకు విద్యా ర్థులు న్నారు. మెదక్‌ జిల్లాలో 923 పాఠశాలున్నాయి. సిద్దిపేట జిల్లాలో 976 పాఠశాలలున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి 3161 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో 3.50 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదు వుకుంటున్నారు. వీటిని కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం మన ఊరు మన బడి పేరిట 12 రకాల మౌ ళిక సదుపాయాల్ని కల్పించేందుకు పనుల్ని చేపట్టింది. ప్రభు త్వ పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం అమలు చేసతన్నా రు. ఇటీవల గత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశా లల్లోనూ అల్పాహారం అందించే పథకాన్ని కూడా ప్రారంభించింది.
ఇంచార్జీలతో లోపించిన పర్యవేక్షణ..
మూడు జిల్లాల్లోనూ మండల విద్యా అధికారి పోస్టుల్లో రెగ్యులర్‌ బాధ్యులు కాకుండా ఇంచార్జీలే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 28 మండలాలుంటే 12 మంది ఎంఈఓలే ఇంచార్జీ లుగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి రెండు మూడు మండల ఇంచార్జీ బాధ్యతలున్నాయి. మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఉపాధ్యా య బదిలీలు చేపట్టారు. జోన్‌-2 పరిధిలోని జిల్లాల్లో కేవలం జీహెచ్‌ఎంల బదిలీలు మాత్రమే జరిగాయి. మిగతా బదిలీలతో పాటు పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో చాలా చోట్ల ఇంచార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 203 ఉన్నత పాఠశాలుండగా కేవలం 130 మంది మాత్రమే జీహెచ్‌ఎంలున్నారు. మిగతా చోట్ల సబ్జెక్ట్‌ టీచర్లను ఇంచార్జీలుగా నియమించారు. ఒక మండల స్థాయి విద్యా అధికారి ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాల న్నిటినీ పర్యవేక్షించాలి. రెగ్యులర్‌గా ఉపాధ్యాయల హాజరు, పాఠ్యాంశాల బోధన, మద్యాహ్నా భోజనం, అల్పాహారం పథకాల అమలు ఇవన్నీ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలి. విద్యార్థుల హాజరు, పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రిపరేషన్‌ జరిగేలా చూడాలి. ఇన్ని బాధ్యతల్ని నిర్వహించాల్సిన ఎంఈఓలకు అదనంగా రెండు మూడు మండలాలకు అదనంగా పని అప్పజెప్పడంతో వాటి పర్యవేక్షణ చూడలేకపోతున్నారు.
సమీపిస్తున్న వార్షిక పరీక్షలు..
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. పదో తరగతి బోర్డ్‌ పరీక్షలు మార్చిలో జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కుంటుపడింది. ఈ ఏడాదిలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో పాఠ్యాంశాల బోధనలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఆయా సబ్జెక్టుల వారిగా పాఠ్యాంశాల్ని భోధించడంలో వెనుకబాటు ఉంది. పైగా పదో తరగతిలో మూడు జిల్లాల్లోనూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటే ఎంఈఓలు, జీహెచ్‌ఎంలు నిరంతరం ఇదే పనిగా పర్యవేక్షణ చేయాలి. ఎంఈఓలైతే వారి మండలాన్ని, జీహెచ్‌ఎంలైతే వారు చూసే స్కూల్‌ బాధ్యతను వంద శాతం నిర్వర్తించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించడం వీలవుతుంది. కానీ..! ఒక్కొక్కరికి అదనంగా మండలాలు, స్కూల్స్‌ ఇంచార్జీ ఇవ్వడంతో దేనికీ న్యాయం చేయలేని పరిస్థితులున్నాయి. పైగా ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాలైన సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట కేంద్రం నుంచి ఆయా పాఠశా లలకు వెళ్లి వస్తున్నారు. ఎంఈఓలు కూడా హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఉంటూ మండలాలకు వెళ్తున్నారు. దీంతో విద్యా బోధన, మద్యాహ్నా భోజనం, అల్పాహారం పథకాల అమలు ఇష్టారాజ్యంగా సాగుతుందనే అభిప్రాయాలున్నాయి. గత సంవత్సరం సాధించిన ఉత్తీర్ణతను కూడా కాపాడుకుంటే చాలనే చర్చ నడుస్తుంది.

Spread the love