విద్యావ్యవస్థ అస్తవ్యస్తం


– పుడ్ పాయిజన్స్ తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం
– కనీసం వాంఖిడి ఘటనతోనైనా చర్యలు తీసుకోని ప్రభుత్వం
– ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి
– ఘటనకు కారణమైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి
– విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
– ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ

హైద్రాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో పుడ్ ఫాయిజాన్ కేసులు వెలుగుచూస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని,వాంఖిడి ఘటనలో విద్యార్ధిని చనిపోయిన కూడా ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని తక్షణమే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పై ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటి ప్రభుత్వాని డిమాండ్ చేస్తోంది. నారయణ పేట మాగనూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ తో ఇప్పటికీ నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 920 మంది ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రి పాలైనరన్నారు.
ఈరోజు మరోసారి ఫుడ్ పాయిజన్ తో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారని వారికిమెరుగైన వైద్యం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది.రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది.
తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ పై రివ్యూ నిర్వహించి ఇలాంటి తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాసిరకం బియ్యం, నిత్యావసర వస్తువులు అందించకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని, పెరిగిన ధరలను అమలు చేస్తూ నాణ్యమైన పౌష్టీకాహారం అందించాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది.

Spread the love