ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రచారం

– మండలంలో 71 శాతం పోలింగ్
– పోలింగ్ కేంద్రాలను సందర్శించిన  ప్రశాంత్ రెడ్డి, సునీల్ కుమార్ 
నవతెలంగాణ కమ్మర్ పల్లి : మండలంలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.మహిళలు, యువకులు, పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో కలిపి 77శాతం పోలింగ్ నమోదయ్యింది. మండలంలో మొత్తం 33389 మంది ఓటర్లు ఉండగా 25,848 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  వీరిలో 15,332 మంది మహిళా ఓటర్లు, 10,516 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమ్మర్ పల్లి, ఉప్లూర్ గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఆయా కేంద్రాలలో పోలింగ్ జరిగిన సరళిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ఉండడంతో  పోలింగ్ సిబ్బందితోపాటు, బందోబస్తుకు వచ్చిన పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
Spread the love