బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ దక్కించుకుంది. దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. తమ శ్రమను గుర్తించి, అవార్డును అందించిన అకాడమీ బృందానికి ధన్యవాదాలు చెప్పారు. దర్శకురాలిగా కార్తికి తొలి ప్రయత్నంలోనే ఆస్కార్‌ని సొంతం చేసుకోవడం విశేషం. 42 నిమిషాలు నిడివిగల ఈ చిత్రం రెండు అనాథ ఏనుగు పిల్లలను ఆదరించిన ఓ పేద దంపతుల కథ. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కి అవార్డు దక్కలేదు. ఈ చిత్రానికి షానక్ సేన్ దర్శకత్వం వహించాడు. ఈ విభాగంలో ‘నవానీ’ చిత్రం అవార్డు అందుకుంది.