– గాజా ఘటనపై బైడెన్
– నెతన్యాహూతో భేటీ
– అమెరికాకు ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయిల్ నేత
టెల్ అవీవ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయిల్ చేరుకుని ప్రధాని నెత న్యాహూతో సమావేశమయ్యారు. హమాస్ ఉగ్ర వాదుల ఏరివేత పేరుతో గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమా నికి బైడెన్ మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. టెల్ అవీవ్ విమానాశ్రయంలో బైడెన్‌కు ఇజ్రాయి ల్ ప్రధాని నెతన్యాహూ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు. దేశ రక్షణ కోసం ఇజ్రాయిల్ చేస్తున్న పోరాటానికి మద్దతు కొనసాగిస్తామని ఈ సందర్భంగా బైడెన్ చెప్పారు. ‘గాజా ఆస్పత్రిపై దాడి జరిపింది మీరు కాదు. ప్రత్యర్థులు అయి ఉండవచ్చు’ అని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయని తెలిపారు. ఈ సంస్థ 31 మంది అమెరికా పౌరులు సహా 1,300 మందిని హతమార్చిందని ఆరోపించారు. ‘హమాస్ ఉగ్రవాదులు చిన్నారులు సహా అనేక మందిని బందీలుగా పట్టుకున్నారు. వేధింపుల కు పాల్పడ్డారు. వీరి కంటే ఐసిస్ కొంత నయం’ అని వ్యాఖ్యానించారు. పాలస్తీనా ప్రజలకు హమాస్ ప్రాతినిధ్యం వహించడం లేదని, పైగా వారిని ఇబ్బందులపాలు చేస్తోందని బైడెన్ అన్నారు. ఇజ్రాయిల్ పక్షాన నిలిచినందుకు బైడెన్‌కు నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు. నాజీలను, ఐసిస్‌ను ఓడిం చేందుకు నాగరిక ప్రపంచం ఎలా ఏకమైందో ఇప్పుడు హమాస్‌ను ఓడించేందుకు కూడా అలాగే సంఘటితం కావాలని కోరా రు. యుద్ధ సమయంలో ఇజ్రా యిల్ లో పర్యటించిన మొట్టమొదటి నాయ కుడు బైడెనేనని అంటూ ఇది తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. ఇజ్రాయిల్ పట్ల, ఆ దేశ ప్రజల పట్ల బైడెన్ వ్యక్తి గతంగా ఎంత చిత్తశుద్ధితో వ్యవహరి స్తున్నారో ఈ పర్యటన నిరూపించిం దని ప్రశంసించారు. అమెరికా సహ కారం అసాధారణమని వ్యాఖ్యానిం చారు. స్వీయ రక్షణ కోసం ఇజ్రాయిల్ కు అమెరికా అందజేస్తున్న సహాయా నికి ఆయన బైడెన్‌కు కృత జ్ఞతలు తెలిపారు. బైడెన్ పర్యటన దృష్ట్యా రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనేక రోడ్లను మూసివేసి, భద్రతా సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించారు.