గొంతులో చీముగడ్డను తొలగించిన ఈఎన్ టి ఆస్పత్రి వైద్యులు..

– వైద్యుల ను అభినందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్  డాక్టర్ శంకర్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
గొంతులో చీము గడ్డ తో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ దొమ్మేట గ్రామానికి చెందిన శృతి (15) బాలిక గత కాన్ని రోజులుగా తీవుమైన గొంతునొప్పి, లో ఏమి మింగరాకుండా, బాదపడుతూ కోఠి ఈ ఎన్ ఆస్పత్రికి వచ్చింది రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వైద్యులు అడ్మిట్ చేసుకొని రక్త పరీక్షలు నిర్వహించి గొంతులో పెద్ద చీము గడ్డ గుర్తించారు. ఈ గడ్డ గొంతులో వెనుక భాగమునుండి, ఛాతి పై భాగానికి కూడా, విస్తరించినట్టుగా గుర్తించారు. దీంతో రోగి ఏమి మింగా లేకుండా బాధపడుతున్నట్లు గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేసిన శ్వాసనాళానికి ఇబ్బంది ఏర్పడి ప్రాణానికే ప్రమాదం ఉంటుందని గుర్తించిన వైద్యులు రోగిప్రాణాలు కాపాడేందుకు ఆపరేషన్ నిర్వహించి 300 ఎంఎల్ చీమును బయటకు తీశారు. రోగిని ఐసీయూకి తరలించారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆపరేషన్ ను విజయవంతం చేసిన వైద్యుల బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ ఆచార్య, డాక్టర్ సంపత్ రావు, డాక్టర్ ఫణి, డాక్టర్ స్వామి, మత్తు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ నిఖిల వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Spread the love