ఘోర ప్రమాదం..శరీరం నుజ్జునుజ్జు

నవతెలంగాణ-హైదరాబాద్ : ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై ఇసుక లారీ దూసుకెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శరీరం నుజ్జు నుజ్జ అయి గుర్తుపట్టలేకుండా ఉండి. ఇసుక లారీ ఢీ కొట్టి వెళ్తుండగా లారీని స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు వాజేడు మండలం మండపాక గ్రామానికి చెందిన చిచ్చడి సురేష్ గా గుర్తించారు.

Spread the love