ప్రేక్షకుల తీర్పే ఫైనల్‌..

నాగ చైతన్య, వెంకట్‌ ప్రభు కాంబోలో వస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్‌ ‘కస్టడీ’. కృతి శెట్టి కథానాయికగా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు. పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు నేడు (శుక్రవారం) ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరో నాగచైతన్య మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
అవుట్‌ఫుట్‌ చూశాకా ప్రేక్షకులు ఎలా రెస్పాండ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది?
సినిమా చాలా బాగా వచ్చింది. ఫలితంపై చాలా నమ్మకంతో ఉన్నా. అయితే ఆడియన్స్‌ ఎలా స్వీకరిస్తారో వారి తీర్పే ఫైనల్‌. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే ఇది కూడా. ఈ సినిమా తర్వాత పూర్తి భిన్నమైన సినిమా చేయబోతున్నా.

పోలీస్‌ నేపథ్యం కదా.. యాక్షన్‌ పార్ట్‌ ఎలా ఉంటుంది?
 ఇందులో యాక్షన్‌ సీన్స్‌ చాలా నేచురల్‌గా ఉంటాయి. ఫైట్‌ మాస్టర్లతో రిహార్సల్స్‌ చేశాక చిత్రీకరణకు వెళ్ళాం. పైకి ఎగిరే సన్నివేశాలు, అండర్‌ వాటర్‌ వంటి సీన్స్‌ వారితో చర్చించాక చేసినవే. కస్టడీ ట్రైలర్‌, టీీజర్‌లో అది మీకు కనిపిస్తుంది. మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తారు. అందుకే కీలమైన యాక్షన్‌ పార్ట్‌ను చాలా జాగ్రత్తగా చేశాం. ఇక పోలీస్‌ నేపథ్యంలో ఉండే ఈ ఫైట్స్‌ బాగా అలరిస్తాయి.

మీ పాత్ర తీరు గురించి?
నేను కానిస్టేబుల్‌గా నటించా. నా పాత్రపరంగా దర్శకుడు వెెంకట్‌ప్రభు చెప్పింది చెప్పినట్లు తీశారు. నేనూ పూర్తి న్యాయం చేశాను. ఎంజారు చేస్తూ చేశా.
అరవింద్‌ స్వామితో నటించడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
అరవింద్‌సామికి స్క్రిప్ట్‌ పేపర్‌ ఏది ఇస్తారో దాన్ని ఓన్‌గా తన శైలిలో ఇంప్రూవ్‌మెంట్‌ చేసుకుంటారు. ఆయన తీరు నాకెంతో బాగా నచ్చింది. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది.
కృతి శెట్టి నటన గురించి?
ఇందులోతను ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా పండించింది. నటిగా తను చాలా మెచ్యూర్డ్‌. తమిళం బాగా నేర్చుకుంది.

తమిళంలో డబ్బింగ్‌ మీరే చెప్పారా?
నటుడిగా వాయిస్‌ ముఖ్యం. అందుకే తమిళంలో నేనే డబ్బింగ్‌ చెప్పాను. మొదట్లో చిన్న చిన్న లోపాలున్నా అంతిమంగా బాగానే చెప్పగలిగాను.
నాగార్జునకి శివ, మీకు కస్టడీ అని నిర్మాత అన్నారు..?
ఏ సినిమాకూ ‘కస్టడీ’ని కంపేర్‌ చేయవద్దు. (నవ్వుతూ).

Spread the love