న్యూ ఇన్కం ట్యాక్స్ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఆదాయ ప‌న్ను 2025 బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఆ బిల్లును హౌజ్ క‌మిటీకి సిఫార‌సు చేయాల‌ని ఆమె స్పీక‌ర్ ఓం బిర్లాను కోరారు. కొత్త ఆదాయ ప‌న్ను బిల్లును ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకించాయి. కానీ మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానాన్ని ఆమోదించారు. హౌజ్ సెలెక్ట్ క‌మిటీకి ఆదాయ ప‌న్ను ముసాయిదా తీర్మానాన్ని రిఫ‌ర్ చేయాల‌ని మంత్రి సీతారామ‌న్ కోరారు. అయితే వ‌చ్చే సెష‌న్ తొలి రోజున ఆ సెలెక్ట్ క‌మిటీ కొత్త బిల్లుపై త‌మ నివేదిక‌ను ఇవ్వ‌నున్న‌ది. చాలా స‌ర‌ళ‌మైన రీతిలో ప‌న్ను బిల్లు రూపొందించిన‌ట్టు మంత్రి తెలిపారు.

Spread the love