వ‌ర్షం కారణంగా తొలి రోజు ఆట నిలిపివేత‌…

Matchనవతెలంగాణ – బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టు తొలి రోజు ఆట వ‌ర్షం వ‌ల్ల నిలిచిపోయింది. టీ బ్రేక్ త‌ర్వాత ఆట‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ టైంకు ఆస్ట్రేలియా త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 28 ర‌న్స్ చేసింది. ఉస్మాన్ ఖ‌వాజా, నాథ‌న్ మెక్‌స్వీనే .. క్రీజ్‌లో ఉన్నారు. ఇద్ద‌రూ బుమ్రా బౌలింగ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. 13.2 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 28 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత వ‌ర్షం అంత‌రాయం వ‌ల్ల మ్యాచ్‌ను నిలిపేశారు. రెండో రోజు ఆట భార‌త కాల‌మాన ప్ర‌కారం ఉద‌యం 5.20 నిమిషాల‌కు ప్రారంభంకానున్న‌ది. రేపు 98 ఓవ‌ర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

Spread the love