– వర్ధబమాన్ లిథియం వెల్లడి
నాగ్‌పూర్ : దేశంలోనే తొలి లిథియం రిఫైనరీని తాము ఏర్పాటు చేస్తున్నట్టు వర్ధమాన్ రిఫైనరీ చైర్మెన్ సునీల్ జోషి, డైరెక్టర్ వేదాంష్ జోషి తెలిపారు. రూ.42,532 కోట్లతో నాగ్‌పూర్ సమీపంలో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమీక్షంలో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. 500 ఎకరాల్లోని ఈ ప్లాంట్‌లో ప్రతీ ఏడాది 60వేల టన్నుల లిథియం రిఫైన్ చేయడం ద్వారా 20గిగావాట్ బ్యాటరీలను తయారు చేయనున్నామన్నారు.