– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్
– మణుగూరు నుంచే ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు 11న తేదీన మొదటగా పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న కార్యక్రమాన్ని మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, మేధావులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మండ్ల పథకాన్ని పినపాక నియోజకవర్గం మణుగూరులో ప్రారంభించేందుకు విచ్చేయుచున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో ఆ ముత్తాని జమ చేయనున్నారని తెలిపారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ప్రభుత్వం ఇవ్వనుందని, సొంత ఇంటి కల నెరవేరునుందని పేర్కొన్నారు. కావున నేడు మణుగూరు పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించు, బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.