పేట గడ్డపై తొలి మహిళ ఎమ్మెల్యే

నవ తెలంగాణ – నారాయణపేట టౌన్‌
నవంబర్‌ 30వ తేదీన రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు జరిగాయి, వాటి లెక్కింపు డిసెంబర్‌ 3 ఆదివారం నారాయణపేట మరియు మక్తల్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పట్టణ శివారులో గల శ్రీ దత్తా బృందావన్‌ కాలేజీలో నిర్వహించారు. నారాయణపేట నియోజకవర్గం యొక్క తొలి మహిళ ఎమ్మెల్యేగా డాక్టర్‌ చిట్టెం ఫర్నిక రెడ్డి విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మనవరాలు, స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వర్‌ రెడ్డి కూతురు, తల్లి చిట్టెం లక్ష్మి రాష్ట్ర అదనపు కార్యదర్శి పౌర సరఫరాల శాఖ అధికారి, కుంభం శివ కుమార్‌ రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు మేనకోడలు అయినటువంటి డాక్టర్‌ చిట్టెం ఫర్నిచర్‌ రెడ్డి (30)కి భర్త డాక్టర్‌ విశ్వజిత్‌ రెడ్డి కుమారుడు అయన్స్‌ రెడ్డి (4) ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌ రెడ్డి పై 7950 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాల అనంతరం మామ కుంభం శివకుమార్‌ రెడ్డి తమ్ముడు అభిజిత్‌ రెడ్డితో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యవంతమైనారు. దాదాపు 20 సంవత్సరాల మామ నియోజకవర్గం లో చేసిన సేవలకు ప్రజలు నేడు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని నియోజకవర్గ ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను అమలు పరుస్తామని తెలిపారు. తొలిసారిగా పేట గడ్డపై మహిళ ఎమ్మెల్యేగా ఎన్నుకు న్నందుకు ప్రతి ఒక్క మహిళకు కతజ్ఞతలు తెలిపారు. 1,81,708 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీకి 84,005 ఓట్లు రాగా ఎస్‌. రాజేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 76,499 ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ చిట్టెం ఫర్నిక రెడ్డికి 7 బ్యాలెట్‌ ఓట్లు రాగా బిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌. రాజేందర్‌ రెడ్డి కి 256 ఓట్లు వచ్చాయి. మొత్తం 20 రౌండ్లలో ప్రతి రౌండ్లో అధిక్యత చాటుతూ వస్తూ ప్రత్యర్థి ఎస్‌.రాజేందర్‌ రెడ్డి పై 7950 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆనందంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ముఖ్య కూడలలో బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.

Spread the love