హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దు

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయింది. రేసును రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రేసును రద్దు చేస్తున్నట్టు తెలిపారు. రేసుకు సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10న ఈ రేసు జరగాల్సి ఉంది.

Spread the love