నవతెలంగాణ-హైదరాబాద్: ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. టికెట్ ధరల పెంపు విషయంలో ఈ సినిమాకు ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్టు ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని ఉత్తర్వుల్లో పేర్కొంది.