రైతంగా సాయుధ పోరాటాల తెలియ జేపెందుకే వారోత్సవాలను సభలు నిర్వహిస్తున్నామని ఎంపిటిసి అరుణ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలంలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వేట్టి చాకిరి ముక్తి కొరకు నైజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన మహోన్నత ఉద్యమం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని కమ్యూనిస్టుల నాయకత్వంలో కుల మత ప్రాంతభేదం లేకుండా పేదవాడు పీడిత ప్రజలందరూ ఐక్యంగా సాధించిన కీలకవర్గ పోరాటం ప్రపంచంలోనే ప్రఖ్యాత గాంచిన ఈ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు. 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ప్రజలు స్థాపించారు. వేలాది గ్రామాల్లో సాయుధ పోరాటం నడిపించి పది లక్షల ఎకరాల భూస్వాముల వద్ద నుండి స్వాధీనం చేసుకుని పీడీతే ప్రజలకు పంచి పెట్టారన్నారు. కమ్యూనిస్టు యోధులు క్రూర నిర్బంధాన్ని అనుభవించి 1947 నుండి 51 వరకు సాగిన పోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న భారతీయునిలో ప్రభుత్వ విలీనమైంది కొంతమంది విమోచన మరికొందరు విద్రోహం అని చెప్పినప్పటికీ ముమ్మాటికి ఇది విలీనమైన రోజు మాత్రమేనని పోరాట వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తామని అందులో భాగంగా సిరిసిల్లలో బివై నగర్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్, సీఐటీయూ నాయకులు రాజేశం, నర్సయ్య, రమేష్, మల్లారపు దినకర్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.