తన జీవితానికి న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు 

నవతెలంగాణ – బెజ్జంకి
సుమారు 6 నెలలు సహజీవనం చేసిన ప్రియుడు ఇప్పుడు మోసం చేసి దాటవేసే దోరణి అవలంభించడంతో తన జీవితానికి న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (వివాహిత)తన కుమారుడు, తల్లితో కలిసి బైఠాయించిన ఘటన మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో అదివారం చోటు చేసుకుంది. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై వివరాలు వెల్లడించింది. చీలాపూర్ గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతి గత నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు సంతానం. స్థానిక యువకుడు అమర్రాజు క్రిష్ణ తన వెంటపడి దంపతుల మద్య కలహాలు సృష్టించి జీవనాన్ని వీడదీసాడని, బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది. కరీంనగర్ పట్టణ కేంద్రంలో సుమారు ఆరు నెలలు సహజీవనం చేయగా మూడు నెలల గర్భాన్ని తొలగించుకున్నానని, ఇప్పుడు నా జీవితానికి న్యాయం చేయాలని ప్రాధేయపడినా, దాటవేసే దోరణి అవలంభిస్తూ మోసం చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేసింది. సంబధిత అధికారులు, స్థానికులు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. బాధితురాలు బైఠాయించిన ఇంటి అవరణాన్ని పోలీసులు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం బాధితురాలు తన స్వగృహనికి వెళ్లిపోవడం కోసమేరుపు.

Spread the love