– వచ్చే నేలా 9, 10 తేదీల్లో టోకెన్ సమ్మె కు రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు
– ఏఐటియుసి ములుగు జిల్లా సహాయ కార్యదర్శి ఎం డి ఫర్వీణ
నవతెలంగాణ – తాడ్వాయి
గత ఎన్నో సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న పాఠశాల వంట కార్మికులను తొలగించకుండా జీవో ను విడుదల చేయాలని, మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేసే విధానం విరమించుకోవాలని ఏఐటీయూసీ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి ఎం డి పర్వీణ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం పోధెం భవాని, అధ్యక్షతన ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా సహయ కార్యదర్శి ఎండి ఫర్వీణ మాట్లాడారు. గత 24, సంవత్సరాలుగా పాఠశాలలో స్వంత డబ్బులు పెట్టి, వంటలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ పెట్టిన పెట్టుబడి బిల్లుల వేతనాలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నా, ఆదాయం ఉన్నా లేకపోయినా భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచన తో ఇన్నాళ్లు వెట్టి చాకిరీ చేశమన్నారు. వంట కార్మికులను ఈ మధ్య కాలంలో రాజకీయ, ఇతరత్రా కారణాల వల్ల కార్మికులను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి కార్మికులను తొలగించకుండా జిఓ విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, రూ 10 వేల వేతనం వెంటనే చెల్లించాలని అన్నారు. కోడిగుడ్ల ధరలు మార్కెట్లో పెరిగిన విధంగా ధర నిర్ణయించాలని కోరారు. కోడిగుడ్లు వంట సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. లేదంటే ప్రతీ ఒక్క విద్యార్థికి రూ 25 చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రస్తుతం విధ్యార్థులకు కోడిగుడ్లు వడ్డించడం సాధ్యం కాదు అన్నారు. సమస్యలు పరిష్కారం కోసం వచ్చే నెల 9,10, తేదీలలో టోకెన్ సమ్మె కు ప్రతి ఒక్క వంట చేసే కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో, జె యమలీల, అనసూర్య, రాధిక, యన్,నిర్మల, ఊకె లావణ్య, ఆర్ మాధవి, యం డి రూభిన, ధుర్గం లక్ష్మి, పోలేబోయిన అనసూర్య తదితరులు పాల్గొన్నారు.