బహుజన రాజ్యాధికారమే లక్ష్యం

ఎమ్‌సీపీఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఓంకార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలంతా కలిసి ఉద్యమించాలని ఎమ్‌సీపీఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఓంకార్‌ పిలుపునిచ్చారు. ఆదివారంనాడిక్కడి ఓంకార్‌ భవన్‌లో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం ఐదుశాతం ఉన్న ఆధిపత్య కులాలు రాజ్యాన్ని పాలిస్తున్నాయనీ, బహుజన శ్రామిక వర్గ బిడ్డల బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఇది న్యాయం కాదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని విమర్శించారు. బిఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిఎల్‌ఎఫ్‌ చైర్మెన్‌గా నల్ల సూర్య ప్రకాష్‌ ఎన్నికయ్యారు. మరో 35 మందితో రాష్ట్ర కమిటి ఎన్నుకున్నారు.

Spread the love