మెట్రో ప్రయాణికులకు శుభవార్త..రెండు మందుబాటిళ్లు

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధానిలో మెట్రో ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఢిల్లీలోని అన్ని రూట్లలో సీల్ చేసిన రెండు హాల్కహాల్ బాటిల్స్ తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. ఇప్పుడు అన్ని రూట్లలోనూ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, డీఎంఆర్ఎసీ సభ్యులతో కూడిన కమిటీ గత ఆదేశాలను సమీక్షించి తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. డీఎంఆర్ఎ‌సీ ఉత్తర్వుల ప్రకారం, మెట్రో ఆవరణల్లో మద్యం తీసుకోవడంపై మాత్రం నిషేధం అమల్లో ఉంటుంది. “మెట్రో ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణ సమాయాల్లో ప్రవర్తనా నియమావళిని పాటించాల్సి ఉంటుంది. ఆల్కహాల్ ప్రభావంతో అనుచితంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం” అని ఆ ప్రకటనలో డీఎంఆర్‌సీ తెలిపింది.

Spread the love