మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

నవతెలంగాణ -హైదరాబాద్: మహిళలకు శుభవార్త.. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. గత రెండు రోజులతో పోల్చితే నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 280 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.

Spread the love