గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర

నవతెలంగాణ-హైదరాబాద్ : కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఆందోళనకరంగానే కొనసాగుతుండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపు జాప్యం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.350 తగ్గి రూ.72 వేల వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.72,350 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.83,500 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది.

Spread the love