వారికి మాత్రమే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌..జీవో జారీ ప్రభుత్వం

నవతెలంగాణ-హైదరాబాద్‌: అర్హులైనవారికి రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’లో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్‌కార్డు దారులకు రూ.500కే సిలిండర్‌ ఇవ్వనున్నారు. గ్యాస్‌ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్‌ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు.

Spread the love